చట్టాలపై విద్యార్థులకు అవగాహన
మండల కేంద్రంలోని జెడ్పి పాత పాఠశాల ఆవరణలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కే యం లింగన్న చట్టాలపై అవగాహన కల్పించారు.
ఓబులదేవరచెరువు:మండల కేంద్రంలోని జెడ్పి పాత పాఠశాల ఆవరణలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కే యం లింగన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి 5 దశలోనే ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావులేకుండా ఉంటుందన్నారు.
అవగాహన లోపంతో చిన్న చిన్న సమస్యలకు, ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉంటే బాగుంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న సంఘటనల పట్ల సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే కేసులు పునరావృతం కావన్నారు. ఈ క్రమంలో ఎస్.ఐ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.