YS Avinash Reddy: నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో పేర్కొన్న అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ సీబీఐ కోర్టుకు అవినాష్‌రెడ్డి హాజరుకానున్నారు. గతనెల 14న కోర్టుకు హాజరుకావాలని.. ఎంపీ అవినాష్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది సీబీఐకోర్టు. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను.. పరిగణలోకి తీసుకుంది సీబీఐ కోర్టు. అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్‌రెడ్డిని చేర్చింది సీబీఐ. వివేకా హత్య కేసులో 145 పేజీలతో మూడో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై ఆయన ఆరోపణలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో పేర్కొన్నారు. వాటిని మరోసారి పునపరిశీలన చేయాలని లేఖలో పేర్కొన్నాడు అవినాష్‌రెడ్డి.