అవినాష్‌ రెడ్డికి అరెస్ట్ భయం.. ఫ్రస్ట్రేషన్‌లో అనుచరులతో హింసాత్మక చర్యలు.. hmtv సిబ్బందిపై అవినాష్‌ రెడ్డి అనుచరుల దాడి

Avinash Reddy: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్న అంచనాల నేపథ్యంలో ఆయన తీవ్ర ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు.

Update: 2023-05-19 06:21 GMT

అవినాష్‌ రెడ్డికి అరెస్ట్ భయం.. ఫ్రస్ట్రేషన్‌లో అనుచరులతో హింసాత్మక చర్యలు.. hmtv సిబ్బందిపై అవినాష్‌ రెడ్డి అనుచరుల దాడి

Avinash Reddy: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్న అంచనాల నేపథ్యంలో ఆయన తీవ్ర ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఫ్రస్టేషన్‌లో అవినాష్ అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. తరచూ హైదరాబాద్‌‌కు వచ్చి సీబీఐ ఆఫీస్‌లో విచారణకు హాజరవుతున్నారు అవినాష్ రెడ్డి. పక్కరాష్ట్రంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. బాధ్యతగల పదవిలో ఉన్నామన్న విషాయాన్ని విస్మరించి... తమ విధులు నిర్వహిస్తున్న మీడియా సిబ్బందిపై అయన అనుచరులుతో దాడులకు తెగబడుతున్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి రౌడీ మూకలు... హైదరాబాద్‌లో రెచ్చిపోతున్నారు. విచారణ నేపథ్యంలో మీడియా కవరేజ్ చేయకుండా దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దాడులు కేవలం మీడియా వాహనాలు, ఎక్విప్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా... మీడియా సిబ్బందిపైనే పిడిగుద్దులు గుద్దుతూ దుర్భాషలాడారు. ఎంపీ అవినాష్ రెడ్డి కారులో నుంచి ఈ దాడిని చూస్తున్నా ఆపకుండా ఉన్నారంటేనే ఆయన ఆదేశాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఓ ఎంపీగా ఉన్న అవినాష్ కీలకమైన కేసులో విచారణ ఎదుర్కొంటూ... విచారణ సందర్భంగా బాధ్యతాయుతంగా మీడియా కవరేజ్ చేస్తున్న hmtvపై దాడి చేయడం ఏంటని జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంపీగా ఇదేనా మీతీరు..? సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా...? నిజంగా వివేకా హత్య కేసులో మీ పాత్రలేకుండా ఇంత ఫ‌్రస్టేషన్ ఎందుకో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలని జర్నలిస్టు సంఘాలు నిలదీస్తున్నాయి.

ఇది హైదరాబాద్ అనుకుంటున్నారా.? లేక ఆయన నియోజకవర్గం అనుకుంటున్నారో అవినాష్ రెడ్డికే తెలియాలి. మా వద్ద ఇలాంటి సంస్కృతే ఉంటుందని అవినాష్ రెడ్డి ఇలాంటి దాడులతో చెప్పదలుచుకున్నారా.? మీరు సీబీఐ విచారణకు హాజరవడం నిజం కాదా.? వివేకా హత్య కేసులో సీబీఐ మిమ్మల్నీ ప్రశ్నిస్తున్నది వాస్తవం కాదా.? మీరే హత్య చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కదా... దానికి సమాధానం చెప్పకుండా ఈ దాడులేంటి.? ప్రజల పక్షాన నిలుస్తూ వార్తలను అందిస్తున్న hmtvపై దాడి చేస్తూ హైదరాబాద్‌లో సైతం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారా.? ఎంపీ అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి.  

Tags:    

Similar News