Weather Update: తెలుగు రాష్ట్రాలకు 'చల్లని' కబురు.. వరుసగా 5 రోజులు వానలే వానలు!
Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిపింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు 'చల్లని' కబురు.. వరుసగా 5 రోజులు వానలే వానలు!
Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిపింది. ఇవాళ్టి నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి, నైరుతి నుండి వీస్తున్న గాలులు.. మరో వైపు ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించనున్నది. తెలంగాణలో ఆదిలాబాద్, కొముంరంభీం ఆసీపాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో. ఏపీలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ అల్లూరి, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని తెలిపింది.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని ..దీని ప్రభావంతో ఆగ్నేయం నుంచి తేమ గాలులు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతాయని అంచనా వేస్తున్నారు.