Atchannaidu: ప్రభుత్వం అవినీతి అక్రమాలపై.. బీసీలు మాట్లాడుతుంటే అరెస్ట్‌లు, హత్యలు చేస్తున్నారు

Atchannaidu: వైఎస్‌ఆర్ నుండి జగన్ వరకు బీసీలపై కక్ష కట్టారు

Update: 2023-11-17 13:24 GMT

Atchannaidu: ప్రభుత్వం అవినీతి అక్రమాలపై.. బీసీలు మాట్లాడుతుంటే అరెస్ట్‌లు, హత్యలు చేస్తున్నారు

Atchannaidu: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. జగన్ సీఎం అయ్యాక బీసీలపై దామనకాండ జరుగుతుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం అవినీతి అక్రమాలపై బీసీలు మాట్లాడుతుంటే అరెస్ట్‌లు, హత్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ఆర్ నుండి జగన్ వరకు బీసీలపై కక్ష కట్టారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బీసీల సత్తా చూపించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags:    

Similar News