హైదరాబాద్ టూ ఏపీకి ఆర్టీసీ బస్సులు.. వారికి మాత్రమే
కరోనా వ్యాప్తి లాక్‌డౌన్ కారణంతో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. కాగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
కరోనా వ్యాప్తి లాక్‌డౌన్ కారణంతో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. కాగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి ఏపీలోని ఆయా డిపోలకు సర్వీసులు మొదలుకానున్నాయి.
ప్రభుత్వం నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. సొంత ఊళ్లకు వెళ్లిన తర్వాత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు.
ఏపీ వచ్చే 13 వేల మంది కోసం ఈ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ బస్సు సర్వీసులు మియాపూర్-బొల్లారం క్రాన్‌రోడ్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్, ఎల్బీనగర్‌లలో ప్రయాణికులతో ప్రారంభమవుతాయి.ఇప్పటివరకు స్పందన ద్వారా హైదరాబాద్ నుంచి 8వేల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 5వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 13వేలమంది కోసం బస్సు సర్వీసులు నడపనుంది.
మే 18 నుంచి బస్సులను రోడ్డు ఎక్కించడానికి సన్నాహాలు చేసే ఆలోచనలో ఉన్నారట. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేశారు. కొన్ని బస్సు సర్వీసుల్లో 50% ప్రయాణికులనే అనుమతిస్తారు.. ఈ మేరకు సీట్లను భౌతిక దూరం పాటించేలా మార్చాలని సూచనలు చేశారట.