ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు!
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏడు వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై తొలిగించింది.
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏడు వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేసింది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు భిన్నంగా ఆర్టీసీ యాజమాన్యం పొరుగు సేవల ఉద్యోగులు, సిబ్బందిని తొలగించిందని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 7,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ప్రధాన కార్యాలయం సహా రాష్ట్రంలోని ప్రాంతీయ మేనేజర్ల కార్యాలయాలు, బస్సు డిపోలు, వర్క్ షాపులు, ఆస్పత్రుల్లో దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణం చూపి ఉద్యోగులను తొలిగించడంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి.
అసలే కరోనా కష్టాల్లో ఉన్న చిరు ఉద్యోగులకు ఇది తీరని వ్యధగానే చెప్పాలి. ఒక ఓపక్క బస్సులు నడవక నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి.. మరోపక్క వీధిన పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఏరకంగా సహకరిస్తున్దన్న్ది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా కష్టంలో ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హతాశులయ్యారు.