Perni Nani: 'మా' ఎన్నికలపై ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
* 'మా' ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు: మంత్రి పేర్ని నాని
'మా' ఎన్నికలపై ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు(ఫోటో- ది హన్స్ ఇండియా)
Perni Nani-MAA Elections: టాలీవుడ్ మూవీ అసోషియేషన్ ఎన్నికల్లో పొలిటికల్ జోక్యంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 'మా' ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌కు కానీ, వైసీపీ పార్టీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. 'మా' ఎన్నికల్లో తాము ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడంలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.