కరోనా ఫండ్ కోసం బుగ్గన విన్నపాలు
కేంద్ర మంత్రి హర్షవర్థన్‌తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
Buggana Rajendranath (file image)
Andhra Pradesh | కరోనా ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి ఏపీకి సహాయం చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తో భేటీ అయిన బుగ్గన.. రాష్ట్రానికి 981 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, కొవిడ్ కేర్ సెంటర్లను పెంచడంతో ఖర్చు పెరిగిందన్నారు. ఈ నేపధ్యంలో కరోనా ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి ఏపీకి నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు.