AP ICET 2025: ఏపీ ఐసెట్ 2025 హాల్ టికెట్లు విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా..!

Update: 2025-05-03 01:30 GMT

AP ICET 2025: ఏపీ ఐసెట్ 2025 హాల్ టికెట్లు విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా..!

AP ICET 2025: ఏపీ ఐసెట్ 2025 ఎంట్రెన్స్ టెస్ట్ కు సంబంధించి అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఏపీ ఐసెట్ ఎంట్రెన్స్ టెస్టు ద్వారా ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ ఎగ్జామ్ ను మే 7 వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. లేట్ ఫీజుతో కూడా గడువు ముగిసింది. శుక్రవారం హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోండిలా:

1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి.

2. హోం పేజీలోని హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.

4. సబ్‌మిట్ చేస్తే మీ హాల్ టికెట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.

5. ప్రింట్ లేదంటే డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని తీసుకోవచ్చు.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ 2025 ఎంట్రన్ ఎగ్జామ్స్ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. మే 7వ తేదీన ఎగ్జామ్ ఉంది. ఉదయం 9 గంట నుంచి 11. 30 గంటల మధ్య మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 02.00 గంటల నుంచి సాయంత్రం 04.30గంటల వరకు రెండో సెషల్ జరుగుతుంది. ఏపీ ఐసెట్ ప్రిలిమినరీ కీ మే 10వ తేదీన విడుదల చేస్తారు. వీటిపై అభ్యంతరాలను మే 12 వరకు స్వీకరిస్తారు. ఏపీ ఐసెట్ 2025 రిజల్ట్స్ ను మే 21న విడుదల చేస్తారు. అభ్యర్థి సాధించే ర్యాంక్ ను బట్టి సీట్లను కేటాయించనున్నారు.

Tags:    

Similar News