AP DSC 2025 Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్‌టికెట్లు విడుదల
AP DSC 2025 Hall Tickets: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in సందర్శించవచ్చు.
AP DSC 2025 Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్‌టికెట్లు విడుదల
AP DSC 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2025 హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in సందర్శించవచ్చు. అవసరమైన డిటైల్స్ ఎంటర్ చేసి హాల్‌టికెట్ పొందొచ్చు.
ఈ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు ముందుగా సన్నద్ధం కావాలన్న ఉద్దేశంతో మాక్ టెస్ట్‌లను కూడా విడుదల చేసింది.
ఇక ఈసారి డీఎస్సీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీకి ఎగబడ్డారు. మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు తమ పరీక్ష తేదీ, కేంద్ర వివరాలు హాల్‌టికెట్ ద్వారా తెలుసుకోవచ్చు.