AP DGP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి

AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగుతోందని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రకటించారు.

Update: 2025-11-20 12:00 GMT

AP DGP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి

AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగుతోందని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రకటించారు. ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో డీజీపీ రంపచోడవరంలో పర్యటించి, భద్రతా బలగాల విజయాన్ని కొనియాడారు.

 "మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ ఆపరేషన్‌లో అగ్రనేతలు మద్వి హిడ్మా, టెక్ శంకర్ సహా మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు" అని డీజీపీ తెలిపారు.

అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. భద్రతా బలగాలు సాధించిన ఈ విజయానికి డీజీపీ వారిని అభినందించారు.

"కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు, వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని పూర్తిగా మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దుతాం" అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News