Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2025-12-12 07:42 GMT

Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్‌మీడియా, ఈ-కామర్స్‌ వేదికలుగా తమ క్లయింట్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా పలు పోస్టులు వైరల్‌ అవుతున్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

పవన్ కల్యాణ్ పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పోస్టులకు సంబంధించిన లింక్‌లను ఏడు రోజుల్లోపు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాది తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్‌ఎల్‌ల (URLs) జాబితాను 48 గంటల్లోపు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు డిసెంబరు 22కు వాయిదా వేసింది.

గతంలోనూ ప్రముఖులు:

వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులపై చర్యలు తీసుకోవాలని గతంలోనూ పలువురు ప్రముఖులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారిలో తెలుగు నటుడు నాగార్జునతో పాటు బాలీవుడ్‌కు చెందిన అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, కరణ్‌ జోహార్‌, అనిల్‌ కపూర్‌ వంటి నటులు; శ్రీశ్రీ రవిశంకర్‌ మరియు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.

Tags:    

Similar News