AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet: పలు కీలక అంశాలపై చర్చ

Update: 2023-11-03 04:05 GMT

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి సంబంధించి సీఎం నిర్ణయం తీసుకునే అవకా‌శం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే నెలల్లో అమలయ్యే సంక్షేమ పథకాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

విఖాఖపట్టణంలో సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు, మంత్రులు,అధికారుల వసతికి సంబంధించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వైజాగ్ లో అధికారిక నివాసాలు,కట్టడాలకు సంబంధించి త్రి మెన్ కమిటీ నివేదికపై క్యాబినెట్ లో చర్చజరగనుంది. భూ కేటాయింపులు..రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితి, వర్షాభావం పై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం మంత్రులతో సమావే‌శం కానున్నారు. 

Tags:    

Similar News