ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3216 కోట్ల టెండర్ రద్దుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2019-09-04 06:51 GMT

ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3216 కోట్ల టెండర్ రద్దుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్‌లను రికవరీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆశావర్కర్ల విషయంలో కూడా ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాన్ని 3 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదే విధంగా మచిలీ పట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

 మీ అభిప్రాయం చెప్పండి




 

Tags:    

Similar News