AP Budget 2021: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
AP Budget 2021: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది.
AP Budget 2021: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
AP Budget 2021: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. 2021-22 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగిస్తున్నారు. వర్చువల్ విధానంలో గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. కొవిడ్ మృతులకు గవర్నర్ సంతాపం తెలిపారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు.