Andhra Pradesh: ఇన్సైడర్ ట్రేడింగ్ పై తీర్మానం ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టీడీపీ మరియు ఇతర నాయకులపై విచారణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత.

Update: 2020-01-22 10:29 GMT

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టీడీపీ మరియు ఇతర నాయకులపై విచారణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. అనంతరం ఆమె మాట్లాడారు.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణను ప్రారంభిస్తుంది అని.. నేరస్థులను పట్టుకుంటుంది అని సుచరిత చెప్పారు. స్పీకర్ ఆదేశాల ఆధారంగా.. అమరావతిలో భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని తీసుకువచ్చింది.

కాగా అమరావతిలో జరిగిన భూ అవకతవకలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఇంతవరకు 4,070 ఎకరాల భూమిని గుర్తించారు.. చంద్రబాబు కుటుంబ సభ్యుల నుంచి ప్రతిపక్ష నాయకుల జాబితాను ఫైనాన్స్ మినిస్టర్ వెల్లడించారు. 

Tags:    

Similar News