ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Update: 2020-01-20 04:27 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ‍్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సు లను క్యాబినెట్ ఆమోదించనుంది. క్యాబినెట్ భేటీ అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీ అయింది. ఈ భేటీలో అజెండా ఖరారు చేసింది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశంలో కీలకమైన బిల్లుల తోపాటూ, 13జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా తయారు చేసిన బిల్లును అసెంబ్లీ ఆమోదించనుంది.

తెలుగుదేశం పార్టీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సందర్బంగా అమరావతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసరాల్లో సాధారణ ప్రజలను అనుమతించలేదు. ఎక్కడికెక్కడ టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ లు వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలపై అధ్యయనం చేయడం కోసం హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఆకమిటీ కూడా ఈనెల 17న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటినే ఇవాళ్టి క్యాబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు.    

Tags:    

Similar News