Assembly Sessions: మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై శాసనసభలో చర్చ జరుగుతోంది.

Update: 2020-01-22 04:59 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ మండలిలో వికేంద్రీకరణ బిల్లును తిరస్కరిస్తే బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులపై నేడు మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ మండలిలో మంగళవారం ఆయా బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాసన మండలి చైర్మన్‌ వాటిని పరిగణలోకి తీసుకున్నారు. నేడు ఈ బిల్లులపై మండలిలో చర్చ జరుగనుంది.

అయితే వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగనీయకుండా రూల్ 71కింద ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71పై తీర్మానం నెగ్గింది. రూల్ 71 తీర్మానానికి అనుకులంగా 27, వ్యతిరేకంగా 13, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టేముందు రూల్ 71 తీర్మానం పెట్టడం విరుద్ధమని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా ఓటింగ్ సమయంలో టీడీపీ చెందిన ఇద్దరు సభ్యులు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 


Tags:    

Similar News