AP Parishad Elections 2021 Live Updates: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

AP Parishad Elections 2021: రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

Update: 2021-04-08 06:02 GMT

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

AP Parishad Elections 2021: ఎన్నో అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2వేల 58 మంది అభ్యర్థులు ఉండగా ఎంపీటీసీ బరిలో 18 వేల 782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2 వేల 371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికలు ఈరోజు సాయంత్రం వరకు జరగనున్నాయి. వివిధ జిల్లలో ఎన్నికలు జరుగుతున్న తీరు ఈ విధంగా ఉంది.

Live Updates
2021-04-08 06:28 GMT

తూర్పు గోదావరి జిల్లా: 

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో కొందరు యువకులు.. ఓటు వేసిన బ్యాలెట్‌ పేపర్‌ను ఫొటో తీసుకున్నారు. అంతటి ఆగక.. బ్యాలెట్‌ పేపర్లతో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన వివాదంగా మారింది.

2021-04-08 06:26 GMT

గుంటూరు జిల్లా:

ఏపీ పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం గారపాడు పోలింగ్‌ బూత్‌ దగ్గర ఘర్షణకు దిగాయి ఇరువర్గాలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. అధికార పక్షానికి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

2021-04-08 06:25 GMT

కడప జిల్లా: 

రాజువారిపేట: 

కడప జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లెలోని రాజువారిపేట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి వీరంగం సృష్టించారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానంతో ఓ వృద్ధురాలి బ్యాలెట్‌ పత్రంను చించేందుకు ప్రయత్నించారు. రాజేశ్వరిని పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్‌ కేంద్రంలో కాసేపటి వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Full View


2021-04-08 06:23 GMT

అనంతపురం జిల్లా:

అనంతపురం జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 62 జడ్పీటీసీ స్థానాలు, 782 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో అన్ని చోట్ల ఏకపక్షంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. 

2021-04-08 06:21 GMT

నెల్లూరు జిల్లా:

పొనుగోడు:

నెల్లూరు ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పోలింగ్‌ కేంద్ర వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వృద్ధురాలు ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. బీజేపీ ఏజెంట్‌ బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లలో ముంచేయడంతో ఎన్నికలు అధికారులు పోలింగ్‌ నిలిపివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బీజేపీ ఏజెంట్‌ ప్రసాద్‌ బ్యాలెట్‌ బాక్స్ ఎత్తుకెళ్లి నీళ్లల్లో వేశాడు.

2021-04-08 06:19 GMT

విజయనగరం జిల్లా:

అంటిపేట: 

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో మాత్రం పోలింగ్‌ నిలిచిపోయింది. వైసీపీ తరుపున నామినేషన్‌ ఉపసంహరించుకున్న లక్ష్మీ పేరు బ్యాలెట్‌ పత్రాల్లో ముద్రించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు అధికారులు.

Full View


2021-04-08 06:17 GMT

గుంటూరు జిల్లా: 

గుంటూరు జిల్లాలో పరిషత్‌ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. పిట్టలవానిపాలెంలో ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ముత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 

Full View


2021-04-08 06:16 GMT

తూర్పుగోదావలి జిల్లా: 

తూర్పుగోదావలి జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఉదయం 9 గం.లకు కేవలం 4.56 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2021-04-08 06:14 GMT

 పశ్చిమ గోదావరి జిల్లా: 

పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ వద్ద ఉత్రిక్తత నెలకొంది. పంచాయతీ సిబ్బందికి, ఏన్‌ఎం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. శానిటైజర్లు అడిగినందుకు పంచాయతీ సిబ్బంది తమతో గొడవకు దిగారని ఏన్‌ఎం సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రశ్నించిన మీడియాపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021-04-08 06:13 GMT

నెల్లూరు జిల్లా: 

నెల్లూరు జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరం కావడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఇక అల్లూరు మండలం ఇస్కపల్లిలో తమను ఎస్సీగా గుర్తించలేదని ఓ వర్గం వారు ఈ ఎన్నికలను బహిష్కరించారు. 

Tags:    

Similar News