Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3: పోలింగ్ Live Updates

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల మూడోదశ పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ లైవ్ అప్ డేట్స్ ..

Update: 2021-02-17 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్ 

ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

Live Updates
2021-02-17 08:19 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలైన చింతలపుడి మండలం ఎర్రపాలెం గ్రామంలో 60శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

2021-02-17 07:39 GMT

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారు గండి రామినాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే రామినాయుడును గృహానిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రావును పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. 

2021-02-17 07:36 GMT

తూర్పుగోదావరి జిల్లా:

చింతూరు మండలం కోత్తపల్లిలో పోలింగ్‌ అధికారిని మృతి చెందింది. కొత్తపల్లి పంచాయితీ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన దైవ కృపారాణి తీవ్ర ఆస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

2021-02-17 06:05 GMT

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

జిల్లాల వారిగా చూస్తే... 

-శ్రీకాకుళం- 42.65 శాతం

-విజయనగరం- 50.7 శాతం‌

-విశాఖ 43.35

-తూర్పు గోదావరి- 33.52

-పశ్చిమ గోదావరి 32

-కృష్ణా- 38.35

-గుంటూరు- 45.90 

-ప్రకాశం 35.90

- నెల్లూరు 42.16 శాతం నమోదయ్యింది

- ఇక చిత్తూరు 30.59 శాతం

- కడప 31.73

- కర్నూలు 48.72

- అనంతపురం 48.15 శాతం పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

2021-02-17 06:00 GMT

విశాఖలోని హుకుంపేట పోలింగ్‌ కేంద్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. అదేవిధంగా 198 సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఆయన. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను మార్చామంటున్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌

2021-02-17 05:57 GMT

శ్రీకాకుళం జిల్లాలో:

శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పోలింగ్‌ క్లోజ్‌ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

2021-02-17 05:56 GMT

అనంతపురం:

ఉదయం 10.30 గంటలకు నమోదయిన పోలింగ్ 48.15 శాతం.

2021-02-17 05:54 GMT

విజయనగరం జిల్లా:

-ప్రశాంతంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

-ఉదయం 10-30 గంటలకు 50.7 శాతం పోలింగ్ నమోదు

2021-02-17 05:53 GMT

తూర్పుగోదావరి :

రంపచోడవరం

- పంచాయతీ ఎన్నికలు 3వ దశ పోలింగ్ శాతం ఉదయం 10.30 ని.లకు

- రంపచోడవరం డివిజన్: 35.65 %

- ఎటపాక డివిజన్ : 30.06%

- రెండు డివిజన్ల సగటు : 33.52%

- జిల్లా ఎన్నికల సమాచార కేంద్రం

2021-02-17 05:52 GMT

విశాఖ:

- పాడేరు డివిజన్ ఉదయం 10:30వరకు పోలింగ్ శాతం 43.33

- మండలాల వారిగా పోలింగ్ శాతాలు

- అనంతగిరి 38.20 శాతం

- అరకు 50.42 శాతం

- చింతపల్లి 31.50 శాతం

- డుంబ్రీగుడ 53.38 శాతం

- మాడుగుల 52.10 శాతం

- జీ.కే వీధి 26 శాతం

- హుకుంపేట 57 శాతం

- కొయ్యూరు 34 శాతం

- ముచ్చంగిపుట్టు 35 శాతం

- పాడేరు 52.70 శాతం

- పెదబయలు 46.30 శాతం

Tags:    

Similar News