Andhra Pradesh: కోవిడ్‌ పాజిటివ్‌ స్టూడెంట్స్‌కు నో ఎగ్జామ్స్‌

Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వ బాధ్యత అంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Update: 2021-04-30 06:30 GMT

Andhra Pradesh: కోవిడ్‌ పాజిటివ్‌ స్టూడెంట్స్‌కు నో ఎగ్జామ్స్‌


Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వ బాధ్యత అంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌. అంతేకాదు ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దు చేయడం సులభమే కానీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుదంటున్నారు ఆయన. ఇక మే 5 నుండి ఇంటర్‌ ఎగ్జామ్స్‌ కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

ఏపీలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్‌‌, సెకండ్‌ ఇయర్ ‌స్టూడెంట్స్‌కు రోజు విడిచి రోజు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిమిత్తం వేయి 452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సగటున ప్రతి జిల్లాలో 80కిపైగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు అనివార్యమని కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలున్న విద్యార్థుల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన ఎగ్జామ్‌ సెంటర్స్‌ దగ్గర ఉండే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది కోవిడ్‌ స్పెషల్‌ అధికారులను నియమించామన్నారు.

ఇదిలా ఉండగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయకూడదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రెగ్యులర్‌ ఎగ్జామ్స్‌ తరహాలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి రెగ్యులర్‌ విధానంలో పాసైనట్లుగానే ఆవిద్యార్థులకు ధ్రువపత్రాలు జారీ చేస్తామని వెల్లడించారు. ఇక ప్రతీరోజూ పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేయాలని ఆదేశాలిచ్చామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Tags:    

Similar News