టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబే డబ్బులు ఇచ్చి మద్యం షాపులకు పంపుతున్నారు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని.

Update: 2020-05-05 15:03 GMT
Perni Nani (File Photo)

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని. దేశ వ్యాప్తంగా లిక్కర్‌ షాపులకు ప్రధాని మోదీ మినహాయింపు ఇస్తే.. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం దుకాణాలు తీశారని మంత్రి పేర్ని నాని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై విషం చిమ్ముడమే పనిగా పెట్టున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలను లోకేష్‌ ఖండించకోవడం విచారకరమని అన్నారు. బ్రాందీ షాపులు తీయమన్నది ప్రధాని మోడీ అని చంద్రబాబు అది మరచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పుడు జైలులో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలు పంపిస్తున్నాని ఎద్దేవా చేశారు. వైన్‌ షాపులకు టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. 


Tags:    

Similar News