ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా

Update: 2020-05-06 14:08 GMT
Kanagarj (File Photo)

ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా ప్రభావంతో 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 30తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి ఎన్నికలు వాయిదా వేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా ఈ వాయిదా గడువును మరోసారి పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

ఇక ఈ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ కనగరాజ్ స్పష్టం చేశారు. కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసిన రమేశ్ కుమార్ కుమార్‌ను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ప్రభుత్వం పదవి నుంచి తప్పించిది. ఆయన స్థానంలో రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News