ఏపీ రాష్ట్ర రాజధాని మార్పులపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు!
జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల పాటు ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జూన్ 17కు తదుపరి విచారణను వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఉద్దేశించి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని పిటిషనర్ వాదించారు. ఏపీ ప్రభుత్వం ఆర్ 5 జోన్‌గా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు నాలుగు నివాస జోన్లు ఉండేవి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్-2 (తక్కువ సాంద్రత గృహాలు).. ఆర్-3 ( మధ్యస్థాయి గృహాలు), ఆర్-4 (హైడెన్సిటీ జోన్) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఐనవోలు, నిడమర్రు, కురగల్లు, మందడం, గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ.. ఇటీవలే ఉత్తర్వుల విడుదల చేసింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.