ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ అయిన స్థానాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. మొత్తంలో 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Update: 2020-05-10 11:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. మొత్తంలో 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదిలీలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు జాయింట్ కలెక్టర్లలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఒకరు రాష్ట్ర సర్వీసులకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఉంటారు.

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై మరింత పట్టు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణ మూడో జాయింట్ కలెక్టర్ నియమించారు. ముగ్గురు జాయింట్ కలెక్టర్ల కు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ గతంలో నే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

* అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్

* అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి

* చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు

* చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య

* వైఎస్సార్‌ కడప జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి

* వైఎస్సార్‌ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ

* గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్‌ దినేష్‌కుమార్

* గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి

* తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా

* తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి

* పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి

* పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా

*ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ

* ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్

*నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వి నోద్‌కుమార్

* నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి

*శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్

* శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు

* విజయనగరం రైతు భరోసా,రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్

* విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్‌ కుమార్ రావిరాల 

Tags:    

Similar News