రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లు

Update: 2020-05-04 15:48 GMT

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 40 రోజుల పాటు ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మంగళవారం నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రీన్ జోన్స్ లో మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది.ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది.

రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. 10 మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని.., ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ప్రభుత్వం ఆదేశించింది.


Tags:    

Similar News