మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులపై జగన్ సర్కార్ కసరత్తు

Update: 2020-05-09 15:07 GMT
YS Jagan(File photo)

జ‌గ‌న్ స‌ర్కార్ లాక్ డౌన్ నిబంధ‌న‌ల స‌డ‌లిపుల్లో భాగంగా మ‌రికొన్ని మిన‌హాయింపులు ఇవ్వాల‌ని భావిస్తుంది. లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లు మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు అనుమ‌తికి క‌స‌ర‌త్తు చేస్తోంది.

గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల దుకాణాలు తెరిచేలా ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. సరి-బేసి సంఖ్యలో దుకాణాలను విభజించి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేంద్రం సూచనల ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్టు సమాచారం. ఆంధ్రా, తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లే వారికి పరిమిత సంఖ్యలో అనుమతించే అంశంపై ప్ర‌ణాళిలు ర‌చిస్తోంది.


Tags:    

Similar News