విశాఖ బాధితులకు పరిహారం కోసం రూ. 30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై ఘటనలో ప్రమాద బాధితులకు నష్టపరిహారాన్నిరాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై ఘటనలో ప్రమాద బాధితులకు నష్టపరిహారాన్నిరాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.30కోట్ల రూపాయిలు విడుదల చేస్తూ... శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇవాళ విశాఖ ప్రమాదం, తాజా పరిస్థితులుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. వెంటనే బాధితులకు నష్టపరిహారం అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు నిధుల్ని విడుదలు చేసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
ఈ ఘటనలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందేవారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని.. రెండు నుంచి మూడు రోజల పాటు ఆస్పత్రిలో ఉన్నవారికి లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు.. ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తామన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఉద్యొగం వచ్చేలా చేస్తామని హామి ఇచ్చారు.