జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. భూముల విక్రయానికి రంగం సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల అమ్మకాలకు సిద్ధమైంది.

Update: 2020-05-13 16:03 GMT
YS Jagan (File Photo)

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల అమ్మకాలకు సిద్ధమైంది. నవరత్నాల, నాడు - నేడు ప్రభుత్వ పథకాలకు కోసం భూములు వేలం వేయాలని నిర్ణయించారు. తొలి విడతలో విశాఖ, గుంటూరులో తొమ్మిది చోట్ల భూముల విక్రయించనున్నారు.

విశాఖలో ఆరు చోట్ల,గుంటూరులో మూడు చోట్ల ఈ ఆక్షన్ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నారు. ఈ నెల 29న ఈ ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి బిల్డ్ ఏపీ మిషన్‌ కార్యాచరణ రూపొందించింది. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చారు. 


Tags:    

Similar News