ఏపీకి వెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే
కేంద్రం లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగిస్తూ కరోనా కేసులు అధికంగా ఉన్న రెడ్ జోన్స్ తప్ప ఇతర ప్రాంతాలల్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్రం లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగిస్తూ కరోనా కేసులు అధికంగా ఉన్న రెడ్ జోన్స్ తప్ప ఇతర ప్రాంతాలల్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.v అలాగే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది.
అయితే సొంత ఊర్లకు వెళ్లేవారు కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి. వారి కోసం అనుమతులు, ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్‌లను నియమించారు. ఏపీలో సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్‌సైట్‌లో( spandana.ap.gov.in) రిజిస్టర్ చేసుకోవాలని కృష్ణబాబు తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోలేని వారు తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఏపీకి వెళ్లాలనుకునేవారికి ఏర్పాట్లు చేయాలని కోరామన్నారు.
అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.రాజస్థాన్‌లో 9వేల మంది ఏపీకి చెందినవారు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఏపీలో ఉన్న మహారాష్ట్రలకు చెందిన వలస కూలీలను వారి వారి రాష్ట్రానికి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.