రేషన్ కార్డుల కష్టాలకు చెల్లు.. ఏపీలో గ్రామ సచివాలయాలలో 5 రోజుల్లోనే కార్డు!

ఇంతకాలం రేషన్ కార్డ్ కావాలంటే తహశీల్దారు కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది.

Update: 2020-06-04 04:07 GMT
ration cards distribution program in andhra pradesh(file photo)

ఇంతకాలం రేషన్ కార్డ్ కావాలంటే తహశీల్దారు కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అక్కణ్ణుంచి రెవెన్యూ అధికారులకు ఎంతో కొంత ముట్టజెబితేనే కాని కార్డు వచ్చేది కాదు. దీంతో పాటు స్థానిక ప్రజాప్రతినిదులు ప్రాపకం పొందాల్సి వచ్చేది. మీ సేవలో ధరఖాస్తు చేసిన దగ్గర్నుంచి, చేతికి కార్డు వచ్చేవరకు చాలా రకాల మజిలీలు చూడాల్సి వచ్చేది. ఇంత చేసినా కార్డు చేతికొచ్చేవరకు అనుమానమే. అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. మండల కార్యాలయాలకు పోకుండా నేరుగా గ్రామ సచివాలయాల్లోనే వీటిని అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు అక్కడే ధరఖాస్తు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు.

రాష్ట్రంలోని పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందిచేలా సరికొత్త విధానాన్ని అధికారులు రూపొందించగా.. దీనికి సీఎం వైఎస్ జగన్ నుంచి ఆమోదముద్ర లభించింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే జారీ చేసే విధానాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది.

అటు రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి 10,15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనుండగా.. ఒక్కో సంచీ తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు

Tags:    

Similar News