Pensions: 3,20,560 పెన్షనర్లకు బిగ్ షాక్..లిస్టులో నుంచి వారి పేర్లు తొలగింపు..?
Pension
Pensions: ప్రతినెలా 1వ తేదీ వచ్చిందంటే చాలు..పెన్షనర్లకు పండగ వాతావరణమే. ప్రభుత్వం తమను ఆదుకునేందుకు డబ్బు ఇస్తుందని పెన్షనర్లు ఎదురుచూస్తుంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా..పెన్షనర్లకు ప్రతినెలా పెన్షన్ అందిస్తోంది. ప్రతీ నెలా ముసలివారు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్, సంప్రదాయ చర్మకారులు..ఇలా ఎంతో మంది పెన్షన్ పొందుతున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ దారుల జాబితా నుంచి 3, 20, 560 మంది పేర్లను తొలగించేసింది.
అంటే మే నుంచి నుంచి కొత్తగా 89వేల మంది పెన్షన్ అందిస్తున్నారు. కానీ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్న పేరు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే వైసీపీ అధినేత జగన్ సీఎం సీటు నుంచి తప్పుకునే నాటికి ఏపీలో ఉన్న పెన్షన్ దారుల సంఖ్య 66,34,372 అని స్వయంగా జగన్ చెప్పారు. అది అధికారిక లెక్క అన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ మే నెలకు ఇస్తున్న మొత్తం పెన్షన్ దారుల సంఖ్య 63,13,812 అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తొలగించిన పెన్షనర్ల సంఖ్య 3,20, 560.
అయితే తాము పెన్షన్లను పెంచుతున్నామని కూటమీ నేతలు అంటున్నారు. కానీ నిజానికి పేర్లను తొలగించేస్తున్నారు. కొత్తగా వితంతువులకు ఇస్తానమని చెబుతున్నారు. కానీ గత డిసెంబర్ నుంచి రీ వెరిఫికేషన్ చేసి చాలా మంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. కానీ సీఎం కార్యాలయం మాత్రం ఇలా తొలగించడం లేదని ఇలా వార్తలను నమ్మకూడదని చెబుతోంది. కానీ అధికారిక లెక్కలు మాత్రం ఈ వాస్తవాన్ని బయటపెడుతున్నాయి.