ఏపీ రైతులకు మరో విడత వైఎస్ భరోసా.. 49 లక్షల మందికి లబ్ధి!
జగన్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న రైతులకు ఇవాళ్టి(మే 15) నుంచి రైతు భరోసా సొమ్ము వారి ఖాతాల్లో జమ చేయనుంది.
జగన్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న రైతులకు ఇవాళ్టి(మే 15) నుంచి రైతు భరోసా సొమ్ము వారి ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేస్తారు.సాధారణ లబ్ధిదారులు 46,28,767 మంది, చనిపోయిన వారి వారసులు 61,555, వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025, దేవాదాయ భూముల రైతులు 623, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు.
మొదటి విడత ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500 జమచేయనుంది. ఇందులో భాగంగా దాదాపు రూ. 2800 కోట్లు ఈ రోజు జమ చేయనుంది. రూ.2వేల పీఎం కిసాన్ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాలో జమ కాగా, మిగిలిన డబ్బును నేడు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. . ఈ పథకానికి అదనపు నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఈ సొమ్మును బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్ 1902కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ పథకంపై సీఎం జగన్ రైతులకు లేఖ కూడా రాశారు. అందులో 'రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 వంతున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు కుటుంబానికి అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా 5ఏళ్లలో అక్షరాలా రూ.67,500 అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ రైతు భరోసా అందిస్తోంది. రూ.50 వేలకు బదులు రూ.67,500 ఇస్తోంది. తద్వారా ఐదేళ్లలో రూ.17,500 అధికంగా ఇస్తోంది' అని పేర్కొన్నారు.