ఏపీలో రేపటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ

ఏపీలో రేపటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు.

Update: 2020-05-15 13:44 GMT

ఏపీలో రేపటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయనున్నారు. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు ఇవ్వనుంది. కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు రద్దీని బట్టి అదనపు కౌంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రేషన్ కార్డు దారులు, మాస్కులు, గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి ప్రభుత్వం స్పష్టం చేసింది.  

కాగా, ఇప్పటివరకూ మూడు విడతలుగా ఏపీలో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మొదటి విడతలో పంపిణీ చేసినపుడు ప్రజలు ఒక్కసారిగా రేషన్ షాపుల వద్దకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మలివిడత పంపిణీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే వాలంటీర్ల ద్వారా కూపన్ లు ఇచ్చి.. సమయానికి వచ్చి రేషన్ తీసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో తరువాత రెండు విడతల్లోనూ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రజలు రేషన్ తీసుకున్నారు. ఇప్పుడు నాలుగో విడత పంపిణీకి అదేవిధంగా అన్ని జాగ్రత్తలతోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News