జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ పాఠాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నుంచి టెన్త్ విద్యార్థులు చదివే సిలబస్‌ను సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు పంపాలని యోచిస్తోంది.

Update: 2020-05-12 03:55 GMT
YS Jagan (File Photo)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నుంచి టెన్త్ విద్యార్థులు చదివే సిలబస్‌ను సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు పంపాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటోంది. ఈ గ్రూపులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉంటారు. ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు చెప్పటంతో పాటు దానికి సంబంధించిన డేటాను వాట్సాప్ గ్రూపు లో ఉంచుతుంది.

ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తుంది. మొత్తం 24వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు ఈ ఆన్‌లైన్ తరగతుల్లో చేరతారు. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. URL లింకును వాట్సాప్ గ్రూపు లేదా ఈ-మెయిల్‌లో విద్యార్థులకు పంపుతారు. ఆ లింక్ ద్వారా విద్యార్థులు పాఠాలు చూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన అభ్యాస (Abhyasa) పోర్టల్‌లోకి వెళ్లి క్వశ్చన్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా.. పదోతరగతి పరీక్షలపై మంత్రి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలలో కాకుండా జూలైలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 


Tags:    

Similar News