నిమ్మగడ్డ పిటీషన్.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఒకరోజు గడువు

Update: 2020-05-05 15:41 GMT
AP High Court (File Photo)

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో సుమారు 5 గంటలపాటు వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని, దీనికి సంబంధించిన ప్రభుత్వ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేయలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం వాదనలు వినిపించేందుకు ఒకరోజు గడువు ఇచ్చింది. శుక్రవారం ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి విచారణ పూర్తయ్యే అవకాశముంది.


Tags:    

Similar News