విశాఖ బాధితులకు ఈ రోజే రూ. కోటి చొప్పున ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు

విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Update: 2020-05-10 14:36 GMT
YS Jagan (File Photo)

విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. తన నివాసంలో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కంపెనీలో గ్యాస్‌లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు కోలుకుంట్ను వైనం, వారికి చికిత్స అందుతున్న తీరును అధికారులు నివేదించారు. గాలిలో గ్యాస్‌ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని అధికారులు చెప్పారు. దీనిపై నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని అధికారులు వివరించారు.

కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరెన్‌ గ్యాస్‌ అవశేషాలు తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి సీఎం వివరాలు .తెలుసుకున్నారు. అన్నిరకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని సీఎం వైస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ముమ్మరంగా శానిటేషన్‌ జరపాలని సీఎం ఆదేశించారు.

ఈ దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇవాళే పరిహారం అందించాలని ఏం ఆదేశించారు. రేపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని, మిగిలిన వారికి ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.  


Tags:    

Similar News