లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి: సీఎం జగన్

Update: 2020-05-05 14:06 GMT
YS Jagan Mohan Reddy (File Photo)

కరోనా పరీక్షల పరంగా చూస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, ప్రతి 10లక్షల జనాభాకు 2500కి పైగా పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలతోపాటు ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, గృహనిర్మాణం, ఉపాధి హామీ అంశాలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో 40రోజుల క్రితం తిరుపతి స్విమ్స్‌ తప్ప మరెక్కడా కరోనా పరీక్షలు చేసే సౌకర్యం లేదని.. ప్రస్తుతం 11 జిల్లాల్లో పరీక్షలు చేసే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కరోనా పరీక్షలు చేస్తే ఫలితాలు త్వరగా వస్తున్నాయని తెలిపారు.

గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్‌ ఉందన్నా సీఎం.. కరోనాను ఎంత కట్టడి చేయాలన్నా.. అది ఎక్కడో ఓ చోట కనిపిస్తోందన్నారు. కరోనా మరణాల రేటు కేవలం 2 శాతంలోపే ఉందన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రాలోని వలప కార్మికులు ఏపీకి తిరిగి వస్తున్నారని.. వాళ్లకు క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్‌ వెల్లడించారు. లక్షకు పైగా వలస కూలీలు, మరో లక్ష మంది ఇతరులు కూడా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారూ.దాదాపు 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసం లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు.


Tags:    

Similar News