గిరిజనులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. సీఎం జగన్ కీలక నిర్ణయం
గిరిజనులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
గిరిజనులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎస్టీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో గిరిజన వర్గాలల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహిస్తూ గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తో సమీక్షించిన సీఎం సుప్రీంకోర్టు తీర్పును చిన్నంగా పరిశీలించి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలువడిన జీవో కాబట్టి ఈ తీర్పుపై ఇతర రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని, తెలంగాణతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు.