Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది.

Update: 2025-09-30 01:37 GMT

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఉదయం వీరిద్దరూ న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.

అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జీఎస్టీ 2. 0 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించనున్నారు. మరోవైపు నారా లోకేశ్ సైతం న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది.

Tags:    

Similar News