ఎంఫాన్ తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎం జగన్

ఎంఫాన్ తుపాన్‌ను ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

Update: 2020-05-04 13:40 GMT
YS Jaganmohan Reddy(File photo)

ఎంఫాన్ తుపాన్‌ను ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా సహాయక చర్యలు, టెలీ మెడిసిన్‌ సేవలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టెలీ మెడిసిన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా రోజుకు పరీక్షల సామర్థ్యం 6 వేల నుంచి 10 వేలకుపైగా పెరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. 24 గంటల్లో 10,292 కరోనా పరీక్షలు చేశామని.. ఇప్పటి వరకు 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా కరోనా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. 45 కేంద్రాల్లో 345 ట్రూనాట్‌మిషన్లు కూడా పని చేస్తున్నాయని, 11 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని సీఎంకు వివరించారు.

రాష్ట్రం 'ఎంఫాన్' తుపాన్‌ను వైపు వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని తుపాను కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించాలని సీఎం సూచించారు. విద్యుత్తు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకుల విజ్ఞప్తులను పరిశీలించి రాష్ట్రంలోకి అనుమతులు ఇవ్వలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News