ఏపీ మంత్రి మండలి నిర్ణయాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
ఎలూరు జిల్లా నుజివీడు టౌన్ & మండలంలో R.S.No.1065/1B లో 0.60 ఎకరాలు, R.S.No.1065/2B లో 9.36 ఎకరాలు కలుపుకుని మొత్తం 9.96 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (IIPM) స్థాపన కోసం హార్టికల్చర్ & సెరికల్చర్ విభాగ డైరెక్టర్ కు 33 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. లీజు అద్దె రూ. 13,70,000 సంవత్సరానికి చెల్లించాలి. అయితే, ప్రతి 5 సంవత్సరాల వ్యవధిలో ప్రస్తుత లీజు అద్దెపై 10% వరకు పెంచవచ్చు. లేదా BSO-24 నిబంధనల ప్రకారం ఉచితంగా, G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.9.2012, ఇతర సాధారణ నిబంధనల ప్రకారం కేటాయించవచ్చు.
Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామం & మండలంలో సర్వే నెం.972 (పాత R.S.No.971)లో 9.88 ఎకరాల లీజును మూడు (3) సంవత్సరాల కాలానికి పునరుద్ధరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని వేదాంత లిమిటెడ్ (I&I ద్వారా)కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. లీజు అద్దె మార్కెట్ విలువపై 10% చొప్పున ఏడాదికి రూ.15,00,000/- (మొత్తం భూమి విలువ 9.88 ఎకరాలకు రూ.14,82,000) చెల్లించాలి. ఇది G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.09.2012 లోని 3(h)(d) నిబంధనల ప్రకారం ఉంటుంది.
తిరుపతి జిల్లా దామినేడు గ్రామం సర్వే నెం.193-8, 193-9 మొదలైన వాటిలో మొత్తం 28.37 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి స్థానంలో SAAP కు "స్పోర్ట్స్ సిటీ" స్థాపన కోసం ఉచితంగా ఆ భూమిని బదిలీ చేసేందుకు తే.12.12.2025న రెవెన్యూ (భూములు-VIII) శాఖ ద్వారా జారీ చేసిన G.O.Ms.No.490 ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ముందుగా తే.28.11.2025న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కౌన్సిల్ రిజల్యూషన్ నెం.571/2025 ద్వారా ఈ భూమిని AP టూరిజం అథారిటీ (APTA)కి నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాపనకు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. తరువాత యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ అభ్యర్థన మేరకు APTA స్థానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP)కు "స్పోర్ట్స్ సిటీ" స్థాపన కోసం బదిలీ చేయాలని నిర్ణయించారు. తత్కాలిక అవసరం దృష్ట్యా తే.12.12.2025న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. BSO-24 మరియు G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.9.2012 నిబంధనలు, సాధారణ షరతులకు లోబడి ఉచితంగా బదిలీ చేయబడుతుంది.