AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి.
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు సుమారు వారం నుంచి పది రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌లకు బదులుగా బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణలు, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో పాటు, 'ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025' కు బదులుగా ఒక బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.