చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం జగన్!
CM Jagan condolences : శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) నిన్న (శనివారం) కన్నుమూసిన సంగతి .
China jeeyar swami, YS Jagan Mohan Reddy
CM Jagan condolences : శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) నిన్న (శనివారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే.. మాతృమూర్తి మరణంతో చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు. దీనితో అయనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్ చేసి పరామర్శించారు. . సీఎం వైఎస్ జగన్ స్వయంగా చినజీయర్ స్వామికి ఫోన్ చేసి అలివేలుమంగ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగ (85) ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.శనివారం మధ్యాహ్నం దహన సంస్కారాలు నిర్వహించగా.. చినజీయర్ స్వామి నిప్పంటించారు. ఆమె మృతి పట్ల శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విచారం వ్యక్తం చేశారు.