త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం

X
Highlights
చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) కన్నుమూశారు....
Arun Chilukuri12 Sep 2020 6:10 AM GMT
చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) కన్నుమూశారు. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగ (85) ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చినజీయర్ ఆశ్రమం సమీపంలో అలివేలుమంగ అంత్యక్రియలు జరగనున్నాయి. మాతృమూర్తి మరణంతో చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు. తల్లి అలివేలుమంగ అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగివుండేవారు చినజీయర్ స్వామి. ఆమె పరమపదించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తల్లితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
Web TitleChinna jeeyar Swamy mother alivelu manga passes away
Next Story