Visakhapatnam: విషాదం.. గన్‌తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Visakhapatnam: ఉదయం 5 గంటలకు విధులకు హాజరైన శంకర్‌రావు

Update: 2024-04-11 04:32 GMT

Visakhapatnam: విషాదం.. గన్‌తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Visakhapatnam: విశాఖలోని ద్వారకా పీఎస్ పరిధిలోని విషాదం జరిగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్‌రావు సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం ఐదు గంటలకు విధులకు హాజరైన ఆయన తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఓబీ బ్యాంక్‌లో గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News