AP Assembly Sessions: దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్.. అదే స్థాయిలో రియాక్ట్ అయిన బాలకృష్ణ
AP Assembly Sessions: తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ వాయిదా
AP Assembly Sessions: దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్.. అదే స్థాయిలో రియాక్ట్ అయిన బాలకృష్ణ
AP Assembly Sessions: అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ మంత్రి అంబటి సవాల్ విసిరారు. మీసాలు ఇక్కడ కాదు తిప్పేది.. సినిమాల్లో తిప్పు అని అంబటి అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
అసెంబ్లీలో మంత్రి అంబటి మాట్లాడుతుండగా రండి చూసుకుందాం అంటూ బాలకృష్ణ చేతితో సైగలు చేసి మీసం తిప్పారు. బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన తెలిపారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ కొట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల సవాల్ ప్రతిసవాళ్లతో సభలో గందరగోళం కొనసాగింది.