అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడి విచారణ వేగవంతం చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. 796 మంది తెల్ల రేషన్ కార్డు దారులపై కేసు నమోదు చేసింది సీఐడి. ఎకరం రూ. 3 కోట్లతో 761 ఎకరాలు వైట్ కార్డు హోల్డర్ లు కొన్నట్టు సీఐడీ గుర్తించింది. దాంతో వారిపై కేసులు నమోదు చేసింది. వీరితో భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తమను బెదిరించి భూములు లాక్కున్నారని సీఐడీకి వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మ అనే ఫిర్యాదు చేశారు. బుజ్జమ్మకు చెందిన 99 సెంట్ల అసైన్డ్ భూమిని టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రుల పై సిఐడి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.