వింజమూరు: ప్రసుత్తం కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతం కావడంతో లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఎస్సై ఎ.బాజి రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక బంగ్లా సెంటర్లో ద్విచక్ర వాహనదారులను ఆపి బయట తిరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
లాక్ డౌన్ ని మయంలో ఇళ్ళల్లోనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. సరదాగా బయట తిరగడం వల్ల ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలనుండి వ్యక్తులు బయట సంచరించరాదన్నారు. పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులున్నారు.